బరువు పెరగాలంటే ఖర్జూరాలని వీటితో కలిపి తినండి..

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 12:22 PM

బరువు పెరగాలంటే ఖర్జూరాలని వీటితో కలిపి తినండి..

డైలీ ఆహారం లో భాగంగా డ్రై ఫ్రూప్ట్స్ తినమంటారు . చాల మంది కరోనా తర్వాత డ్రై ఫ్రూప్ట్స్ తినడం అలవాటు చేసుకున్నారు . అయితే అందులో కొన్ని బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి . మరి కొన్ని బరువు పెరగడానికి ఉపయోగపడతాయి . అవి ఏంటి అంటే ఖర్జూరాలు. కానీ చాల మంది తెలియక ఖర్జూరాలు తింటే వేడి చేస్తుందని అంటారు. కానీ, ఇది నిజం కాదు. ఆయుర్వేదం ప్రకారం, ఖర్జూరాల్లో శీతలీకరణగా ఉన్నాయి. దీంతో వీటిని తింటే పిత్త సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తియ్యగా ఉంటాయి. నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల వాత, పిత్త దోషాలను తగ్గించి శక్తిని ఇస్తుంది.
ఖర్జూరాల్లో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్స్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి విటమిన్ సి, విటమిన్ డి వంటి పోషకాలను అందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.అంతేకాకుండా ఖర్జూరాలని నానబెట్టి తింటే చాలా మంచిదని తెలుస్తుంది . వీటిని నానబెట్టి తింటే

మలబద్దకం దూరమవుతుంది.
బ్రెయిన్ హెల్త్‌కి మంచిది
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నీరసాన్ని తగ్గిస్తుంది
కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
ఎముకలు బలంగా మారతాయి.
రక్తపోటు తగ్గుతుంది.
స్త్రీ, పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతుంది.
రక్తహీనత దూరం
హెల్దీ బరువు మెంటెయిన్ అవుతుంది.
పైల్స్ సమస్య తగ్గుతుంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మంచిది.
చర్మం, జుట్టుకి మంచిది.
వాపుని తగ్గిస్తుంది.

బరువు పెరగడానికి ఖర్జూరాలని నెయ్యితో కలిపి తినాలి. అది కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి.సాధారణంగా రోజుకి 2 ఖర్జూరాలు తినొచ్చు.బరువు పెరగాలనుకునే వారు రోజుకి 4 తినాలి.ఎలా తినడం వలన బరువు పెరుగుతారు .
ఖర్జూరాలని నానబెడితే టానిన్, ఫైటిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి పోషకాలను గ్రహించడంలో హెల్ప్ చేస్తాయి. ఖర్జూరాలని నానబెడితే త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి, వాటిని నానబెట్టి తింటే రుచి కూడా పెరుగుతుంది. వాటిలోని పోషకాలు పూర్తిగా అందాలంటే కనీసం 8 గంటలు నానబెట్టాలి.పిల్లలకి కూడా డేట్స్ చాలా మంచివి. వీరితో తినిపిస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు కూడా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ లోపం, ఇమ్యూనిటీ లోపంతో బాధపడేవారు రోజూ రెండు ఖర్జూరాలు తింటే చాలా మంచిది. ఇలా 2 నుంచి 3 నెలల పాటు నిరంతం తీసుకోండి.చాల మంది తెలియక వయస్సులో ఉన్న పిల్లలకు ఖర్జూరాలు పెట్టకూడదు అంటారు దీని వలన తొందరగా రజస్వల అవుతారు అనే నమ్మకం కానీ ఇది నిజం కాదు . అవి అన్ని అపోహలే .





Untitled Document
Advertisements