ఎంతో రుచిగా ఉండే మసాలా ఇడ్లీ ట్రై చేయండి..

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 09:34 AM

ఎంతో రుచిగా ఉండే మసాలా ఇడ్లీ ట్రై చేయండి..

తమిళనాడులో ఎక్కువగా దొరికే టిఫిన్ అంటే ఇడ్లీ సాంబార్ ఈ రెండిటికి అంత ప్రత్యేకత ఉంది . చాల మంది అల్పాహారంలో ఇడ్లీని తీసుకుంటారు. అయితే ఎప్పుడూ ఒకేలాగా ఇడ్లీ తింటే కొత్తగా ట్రై చేయండి. మసాలా ఇడ్లీని తయారు చేయండి. నేరుగా ఇడ్లీలు చేసుకుని ఇది తయారు చేయవచ్చు. లేదంటే రాత్రి ఇడ్లీ చేసుకుని మిగిలిపోయినా ఈ రెసిపీ ప్రిపేర్ చేయెుచ్చు. ఈ మసాలా ఇడ్లీ సరైన అల్పాహారం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా సులభం. పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. అయితే ఇడ్లీతో మసాలా ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:
ఇడ్లీ - 6, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1/2 కప్పు, కారం - 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి - 5, టమోటో - 1 కప్పు, ఉప్పు - రుచి ప్రకారం, పసుపు పొడి - 1/2 tsp, మిరియాల పొడి - 1/2 tsp, పావ్ భాజీ మసాలా - 1/2 tsp, నిమ్మరసం - 1/2

మసాలా ఇడ్లీ తయారీ విధానం:
ముందుగా తయారు చేసిన ఇడ్లీలను కట్ చేసి విడిగా పెట్టుకోవాలి.

తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి వేయించి, పైన ఉప్పు చల్లి
ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి.

పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30 సెకన్లు వేయించాలి.తర్వాత అందులో టొమాటోలు వేసి మెత్తగా వేయించాలి.

టొమాటోలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. ఉప్పు, కారం, పసుపు, పావ్ భాజీ మసాలా రుచికి తగినట్లుగా వేసి 1
నిమిషం పాటు వేయించాలి.
తర్వాత ఇడ్లీ ముక్కలను వేసుకోవాలి. మసాలాలు బాగా కలిసే వరకు ఇడ్లీలో మెల్లగా తిప్పాలి. పైన నిమ్మరసం, కొత్తిమీర చల్లితే రుచికరమైన మసాలా ఇడ్లీ రెడీ. ఇడ్లీ తినడానికి ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా ఈ మసాలా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు .





Untitled Document
Advertisements