కరెంట్ బిల్ 200 యూనిట్స్ లోపు రావాలి అనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి..

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 09:55 AM

కరెంట్ బిల్ 200 యూనిట్స్ లోపు రావాలి అనుకుంటున్నారా? ఈ టిప్స్  పాటించండి..

ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ బిల్ పైన సబ్సిడీని ఇస్తుంది అందుకే బిల్ తక్కువగా వచ్చేటట్లు చేసుకుంటే ఈ సబ్సిడీ అందరికి వస్తుంది. అయితే మనం ఇంట్లో వాడే ఫ్రీజ్, కూలర్, ఏసీ, ప్యూరీఫైర్, గ్లిసెర్ మొదలైన వాటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది . ప్రస్తుతం ఉన్న వేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ కొనుక్కోవాలన్న కోరిక ఉంటుంది. అయితే ఎలాంటి ఫీచర్స్ ఉన్న ఫ్రిజ్ కొనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎన్ని స్టార్లు ఉన్న ఫ్రిజ్ కొనుక్కోవాలి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి కుటుంబంలో వస్తుంటాయి. అయితే ఇంట్లో ఉన్న అవసరాల బట్టి ఫ్రిజ్ కొనుక్కుంటే బాగుంటుంది.

కొనుక్కునే ముందు ఆ ఫ్రిజ్లో ఎలాంటి వస్తువులు పెట్టాలో అలాగే ఎలాంటి వస్తువులు పెట్టకూడదు అవగాహన ఉండాలి. ఇలాంటి అవగాహన ఉంటే ఫ్రిజ్ వాడకం సులభంగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రిజ్ వాడడం వల్ల ఎంత కరెంటు బిల్లు వస్తుందో కూడా తెలుసుకోవడం ఉత్తమం. ఫ్రిజ్‌పై ఉన్న స్టార్ ఆధారంతో కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు.

కొన్ని షాప్ లో హయ్యర్ కంపెనీ 160 లీటర్ల బేసిక్ ఒక స్టార్ ఫ్రిజ్ ఎం ఆర్ పి ధర 15000 రూపాయలు ఉంటే ఈ మెగా సేల్ లో కేవలం 12000 రూపాయలకే అందిస్తున్నారు. వోల్టాస్ కంపెనీ 190 లీటర్ల త్రీ స్టార్ ఫ్రిజ్ కేవల 14800 రూపాయలకే లభిస్తుంది.అంతే కాకుండా కొన్ని షాప్ వారి దగ్గర హయ్యర్ కంపెనీ 240 లీటర్ల రెండు స్టార్ల రేటింగ్ ఫ్రిజ్ కేవలం 25 వేల రూపాయలకు లభిస్తుంది. ఇది రెండు డోర్ల ఫ్రిజ్. దీనిని కన్వర్టబుల్ ఫ్రిజ్ అని కూడా అంటారు. ఈ షాప్ లో ఇలాంటి ఫ్రిజ్లు నాలుగు రంగుల్లో లభిస్తున్నాయి.దీనిలో ఇన్వర్టర్ ఉండడం వల్ల కరెంట్ ని అదుపులో వాడుకుంటుంది. ప్రస్తుతం వచ్చే ఫ్రిజ్ లుఅన్ని ఇన్వర్టర్ మోడల్ తోనే వస్తున్నాయి. స్టెబిలైజర్ ఉపయోగించినక్కర్లేదు అని ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ లూయిస్ తెలిపారు.

ఫ్రిజ్ లు కొనుక్కునే సమయంలో దానిని ఎలా ఉపయోగిస్తామో అవగాహన ఉండాలి. అలాగే ఆ ఫ్రిడ్జ్ ఎంత కరెంటు ఖర్చు చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఒక్క స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్ సంవత్సరానికి 190 యూనిట్ల కరెంటు ని ఖర్చు చేస్తుంది. అలాగే మూడు స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్ సంవత్సరానికి కేవలం 131 యూనిట్ల కరెంట్ ని ఖర్చు చేస్తుందని ఐదు స్టార్ రైటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ 110 యూనిట్ల కరెంట్ ని ఖర్చు చేస్తుందని తెలుస్తుంది . ఇలా మూడు స్టార్ రేటింగ్ మరియు ఐదు స్టార్ రేటింగ్ ఫ్రిజ్లకు సంవత్సరానికి కేవలం 15 నుంచి 20 యూనిట్ల కరెంటు తేడా మాత్రమే ఉంటుందని తెలుస్తుంది . ఈ విధంగా ఫ్రీజ్ కొన్నేటప్పుడు మంచి కంపెనీ ఫ్రీజ్ కొనుకొని మన కరెంటు బిల్ ను ఆదా చూసుకోవచ్చును. ఒక ఫ్రీజ్ మాత్రమే కాకుండా మిగతావి కూడా మంచి కంపెనీవి కొనుకొని కరెంటు బిల్ ఆదా చేసుకోవచ్చు .







Untitled Document
Advertisements