సుకుమార్ సినిమాలకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ నే ఎందుకు ఎంచుకుంటున్నాడు

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 03:43 PM

సుకుమార్  సినిమాలకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ నే ఎందుకు ఎంచుకుంటున్నాడు

డైరెక్టర్ గా సుకుమార్ టాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా ఆర్య, సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టింది.
అంతటి క్రీయేటివిటి ఉన్న డైరెక్టర్ సుకుమార్ మరి ఇప్పుడు ఏమైనది రిస్క్ ఎందుకు తీసుకోలేక‌పోతున్నాడు? రిస్క్ అంటే ఆయ‌న‌కు అంత భ‌య‌మా? ఆయ‌నిక ఆ క్రాప్ట్ లో కొత్త‌గా ట్రై చేసే అవ‌కాశ‌మే లేదా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. తాజాగా ఆర్సీ 17వ చిత్రాన్ని సుకుమార్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `రంగ‌స్థలం` త‌ర్వాత చ‌ర‌ణ్‌-సుక్కు కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. అయితే ఈసినిమాకి కూడా మ‌ళ్లీ రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ నే సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడిదే అంశం నెట్టింట నెటి జ‌నుల్లో చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

సుకుమార్ ఇక దేవికి బాండ్ అయిపోయాడా? కొత్త సంగీత దర్శ‌కుడిని తీసుకోడా? కొత్త‌గా ట్రై చేయ‌డా? ఎన్నాళ్లీ బోరింగ్ కాంబినేష‌న్ అంటూ? అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. సుకుమార్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏడు సినిమాలు తెర‌కెక్కించారు. తొలి సినిమా `ఆర్య‌`కి దేవి శ్రీప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఆ త‌ర్వాత `జ‌గ‌డం ,`ఆర్య‌-2 ,రంగ‌స్థ‌లం` ,.`పుష్ప ది బినిగింగ్` చిత్రాల‌న్నింటికీ కూడా దేవి శ్రీనే ప‌నిచేసాడు. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న `పుష్ప‌-2`కి కూడా దేవి శ్రీనే సంగీతం అందిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుకుమార్ చేసిన ప్రతి సినిమాకు దేవి శ్రీ యే సంగీతం అందించాడు .

దీంతో సుకుమార్ సంగీతంలో కొత్తగా ఎవరిని ట్రై చేయ‌డం లేదు? ఇద్ద‌రిది స‌క్స‌స్ పుల్ కాంబినేష‌న్ అయినా? ఆబాధ్య‌త త‌న‌ది కాద‌ని భావించి ఇలా చేస్తున్నాడా? లేక దేవి శ్రీ త‌ప్ప ఇంకెవ్వ‌రూ సంగీతానికి న్యాయం చేయ‌లేర‌ని భావిస్తు న్నాడా? లేక అస‌లు సంగీత ద‌ర్శ‌కులే లేర‌ని ఆయ‌న ఆలోచ‌న‌లో ఉన్నాడా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రెండవ సినిమాకి దేవి శ్రీని ప‌క్క‌న‌బెట్టేసిన సంగ‌త‌ని గుర్తు చేస్తున్నారు. బుచ్చిబాబు తొలి సినిమా `ఉప్పెన‌`కి దేవి శ్రీనే మంచి సంగీతం అందించాడు. మ్యూజిక‌ల్ గా ఆ సినిమాని ముందే హిట్ చేసాడు. కానీ అదే బుచ్చిబాబు రెండ‌వ సినిమా రామ‌చ‌ర‌ణ్ కోసం ఏకంగా రెహ‌మాన్ నే దించాడు. రెహ‌మాన్ గ‌త స‌క్సెస్ లు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ లెజెండ‌రీని లాంచింగ్ కి సైతం తీసుకొచ్చాడు. అలా సంగీతంలో బుచ్చిబాబు ఛేంజ్ కోరుకున్నాడు. మ‌రి బుచ్చిబాబు గురువు ఎందుకు ఆలోచించ‌లేక‌పోతున్నాడు అని నేటి జనులు అనుకుంటున్నారు . ఏది ఏమైనా సుకుమార్ తీసే కొత్త సినిమాలోనైనా సంగీతంలో కొత్త వారికీ ఛాయస్ ఇస్తాడో చూడాలి మరి .





Untitled Document
Advertisements