మైగ్రెయిన్‌తో విలవిల్లాడుతున్న ఒక మనిషి మెదడులోకి పురుగులు ఎలా వచ్చాయి ?

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 03:56 PM

మైగ్రెయిన్‌తో విలవిల్లాడుతున్న ఒక  మనిషి మెదడులోకి పురుగులు ఎలా వచ్చాయి ?

మీ అందరికి తెలియని కొన్ని నిజాలు చెప్తాను వినండి . ఇవి నిజం మనకు తెలియని ఎన్నో నిజాలు , వాటి వలన ఎలా ఇబ్బందులు ఎదురుకుంటామో మనకు తెలియదు . అలాంటి కోవకు చెందిన ఒక కథ చూడండి .

మైగ్రెయిన్‌తో విలవిల్లాడుతున్న ఓ వ్యక్తి మెదడులో డాక్టర్లు టేప్‌వార్మ్స్ కనిపించాయి. ఇవి రిబ్బనులా చుట్టచుట్టుకుని ఉంటాయి. వీటినే బద్దెపురుగులని అంటారు. సరిగా ఉడకని పందిమాంసం తినడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు.

డాక్టర్లు స్కానింగ్ చేసి చూస్తే ఆయన మెదడులో బద్దెపురుగులు కనిపించాయి. ఈ పురుగులు సిస్టోసెర్కోసిస్‌కు కారణమవుతాయి.
సరిగా చేతులు కడుక్కోకపోవడం, దాంతోపాటు సరిగా ఉడకని పంది మాంసం తినడంవల్లే ఈ ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు డాక్టర్లు భావిస్తున్నారు.
సిస్టోసెర్కోసిస్ అనేది టీ.సోలియమ్ అనే పరాజన్నజీవి (బద్దెపురుగు)ద్వారా సోకుతుంది. ఇది మన పొట్టలోకి చేరి తరువాత మెదడులో తిష్టవేసి తిత్తులు ఏర్పడటానికి కారణమవుతుంది.బద్దెపురుగుతో బాధపడే వ్యక్తులు ఉండే చోట వారి మలమూత్రాల ద్వారా ఇతర కుటుంబసభ్యులకు కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది.అయితే ఉడకని పందిమాంసం తినడంవల్లే నేరుగా ఏ వ్యక్తీ సిస్టోసెర్కోసిస్‌కు గురవ్వరు.ఇది కేవలం ఊహాజనితం మాత్రమే. రోగికి సిస్టోసెర్కోసిస్ అనేది చేతులు సరిగా కడుక్కోకపోవడం వల్ల ఆటోఇన్ఫెక్షన్ ద్వారా సోకింది’’

అమెరికాలోని సెంటర్స్ ఫర్ డీసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం బద్దెపురుగు కణజాలాల్లోకి చొచ్చుకుపోయి అక్కడి నుంచి మెదడులోకి వెళ్ళి సిస్ట్‌లు ఏర్పరస్తుంది. మెదడులో ఇలాంటి సిస్ట్‌లు కనపడటాన్ని న్యూరోసిస్టోసెర్కోసిస్ అని పిలుస్తారు.
‘బద్దె పురుగులు ఉన్న వ్యక్తి విసర్జితాల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది’’ అని సీడీసీ పేర్కొంది. కలుషిత ఆహారం, నీరు,మలం వల్ల కలుషితమైన ఉపరితలాల వల్ల బద్దెపురుగుల గుడ్లు మనలోకి ప్రవేశిస్తాయి.చేతులు సరిగా కడుకోక్కుండా అపరిశుభ్రమైన వేళ్ళను నోట్లో పెట్టుకున్నా బద్దెపురుగుల గుడ్లు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. దీని బాధితుల వల్ల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఈ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.అయితే, ఉడకని పంది మాంసం తినడం వల్ల సిస్టోసెర్కోసిస్ రాదని నిపుణులు చెబుతున్నారు.

సిస్టోసెర్కోసిస్ పరిస్థితులు సాధారణంగా లాటిన్ అమెరికా దేశాలలోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆసియా, అఫ్రికాలోనూ ఎక్కువగా కనిపిస్తాయి. పైగా గ్రామీణ ప్రాంతాలో ఇది సాధారణమే. ఇక్కడ బద్దెపురుగులకు వాహకాలుగా ఉండే పందులు యథేచ్ఛగా
తిరుగుతుంటాయి. దీంతోపాటు అపరిశుభ్రత, పేలవమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి.చేతులు సరిగా కడుక్కోకపోవడం, కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు ఇలాంటి ప్రమాదాల్లో పడతారు.అంతే కాకుండా ఉడకని పంది మాంసం వినియోగం’ వల్ల ఏర్పడే ముప్పు, అని తెలుస్తుంది . దీని వలన అపరిశుభ్రమైన అలవాట్లను దూరం చేసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము





Untitled Document
Advertisements