పిల్లల ఇష్టపడేలా ఇంట్లోనే అదిరిపోయే నూడుల్స్ చేసేయండిలా..

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 10:23 AM

పిల్లల ఇష్టపడేలా ఇంట్లోనే అదిరిపోయే నూడుల్స్ చేసేయండిలా..

ఈ మధ్య కాలంలో ప్రతి ఒకరికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇస్తా పడుతున్నారు . ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ,పార్టీ అయినా సరే చైనీస్ వంటకాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు .అందులో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ నూడుల్స్ . చాల మంది వీటిని ఇంట్లో చేయలేమని అనుకుంటారు . కానీ నిజానికి వెజిటబుల్ నూడుల్స్‌ని చాలా సులువుగా ఇంట్లో చేసేయొచ్చు. ఇంట్లోనే చేస్తారు కాబట్టి ఎలాంటి రంగులు, రసాయనాలు వాడకుండా దీన్ని టేస్టీగా చేయవచ్చు. అయితే నూడుల్స్‌ను మైదాతో చేసినవే ఎక్కువగా లభిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో రైస్ నూడుల్స్, మిల్లెట్స్ నూడుల్స్, గోధుమ పిండితో చేసిన నూడుల్స్ కూడా ఉన్నాయి. ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకోండి. మైదాతో చేసిన నూడుల్స్‌ను దూరం పెట్టడమే మంచిది. వీటిని ఇంట్లోనే చేసుకోవడం వలన పిల్లలకు దీన్ని ఆరోగ్యంగా తినిపించవచ్చు.


వెజ్ హక్కా నూడుల్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

నూడుల్స్ - ఒక ప్యాకెట్

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - ఒక స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్

తరిగిన బీన్స్ - అరకప్పు

తరిగిన క్యాబేజీ - అరకప్పు

తరిగిన క్యారెట్ - అరకప్పు

స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - అరకప్పు

క్యాప్సికం తరుగు - అరకప్పు

సోయాసాస్ - రెండు స్పూన్లు

గ్రీన్ చిల్లి సాస్ - రెండు స్పూన్లు

టమోటో సాస్ - ఒక స్పూను

వెజ్ హక్కా నూడుల్స్ తయారీ విధానం :

రైస్ నూడుల్స్ లేదా గోధుమపిండి నూడుల్స్ ను తీసుకోండి. ఈ రెండు చాలా టేస్టీగా వస్తాయి.మొదటగా ఒక గిన్నెలో నీళ్లు వేసి ఈ
నూడుల్స్‌ని వేసి ఉడకబెట్టండి.
మరుగుతున్న నూడుల్స్‌లోనే ఉప్పు, కొంచెం నూనె వేయండి.తర్వాత ఆ నూడుల్స్‌ను తీసి చల్లటి
నీటిలో వేయండి.
ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్ల నూనె వేయండి.నూనె వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్టు
వేయండి. అవి గోధుమ రంగు వచ్చేవరకు ఉంచండి.
తర్వాత పాన్‌లో ముందుగా తరిగి పెట్టుకున్న అన్ని కూరగాయలను వేయండి.బీన్స్, క్యాబేజీ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికం,
ఇవన్నీ వేసి బాగా కలపండి.
అవి వేగాక అందులోనే సోయాసాస్, టమోటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోండి.రుచికి సరిపడా కాస్త ఉప్పును కూడా
చల్లుకోండి.

ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న నూడుల్స్‌ని ఇందులో వేసి కలపండి. అంతే వెజ్ నూడుల్స్ రెడీ అయినట్టే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.

నూడుల్స్ ఆరోగ్యకరమైనవి కాదని చెబుతారు అది నిజమే. ఎందుకంటే నూడుల్స్ అధికంగా మైదాతో చేసినవే లభిస్తాయి. ఇప్పుడు మార్కెట్లో ఆరోగ్యకరమైన నూడేల్స్ కూడా లభిస్తున్నాయి గనుక అప్పుడప్పుడు పిల్లలకు వీటిని వండి పెట్టవచ్చు. ఇక ఇంట్లోనే ఇలా నూడుల్స్ చేయడం వల్ల శరీరానికి నష్టం ఉండదు. అయితే ఈ నూడుల్స్‌ను నెలకు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తినిపించండి. లేకుంటే పిల్లలు జంక్ ఫుడ్‌కు అలవాటు పడిపోతారు. ఇందులో మనం కూరగాయలు అధికంగా వాడాం కాబట్టి ఇవి ఆరోగ్యానికి కూడా మేలే చేస్తాయి.అంతేకాకుండా వీటిని ఇంట్లో చేసుకోవడం వలన దానిలో వాడే ఆయిల్ లాంటివి మంచివి కావున పిల్లలకు ఎప్పుడైనా ఒకసారి పెట్టవచ్చును . ఇలా చేయడం వలన పిల్లలు కూడా అవుట్ సైడ్ ఫుడ్ కి అలవాటు పడరు .






Untitled Document
Advertisements