వ‌ధువు గెటప్ లో తమన్నా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 04:14 PM

వ‌ధువు గెటప్ లో తమన్నా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ తమకు న‌చ్చిన‌వాడిని పెళ్లాడేస్తున్నారు. కానీ కొంత కాలంగా త‌మ‌న్నా పెళ్లి గురించి అడిగితే దాట‌వేస్తోంది. ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌డం లేదు. త‌న ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో డేట్ గురించి మాత్ర‌మే మాట్లాడుతోంది కానీ, పెళ్లి గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. చూస్తుంటే ఇక త‌మ‌న్నాకు కూడా ల‌గ్గం పెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని నెటిజ‌నుల్లో గుసగుస ఆగ‌డం లేదు.
అయితే ఇంత‌లోనే ఒక స‌డెన్ ట్విస్ట్ ఇచ్చింది ముద్దుగుమ్మ త‌మ‌న్నా. స‌డెన్ గా వ‌ధువుగా మారింది. బ్రైడ‌ల్ దుస్తుల్లో ఫోటోషూట్ లో పాల్గొంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో దుమారం రేపుతున్నాయి. అయితే త‌మ‌న్నా నిజంగానే పెళ్లికూతురు అవుతోందా లేదా అంటూ అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌న్నా పెళ్లికూతురు అయిన మాట నిజ‌మే కానీ, ఇది కేవ‌లం డిజైన‌ర్ షో కోసం మాత్ర‌మే. ఇది కేవ‌లం ఒక అంద‌మైన డిజైన‌ర్ ఫోటోషూట్ మాత్రమే . ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ రాహుల్ మిశ్రా రూపొందించిన బ్రైడ‌ల్ డిజైన‌ర్ దుస్తుల్లో త‌మ‌న్నా ముగ్ధ మ‌నోహ‌ర రూపం క‌ట్టి ప‌డేస్తోంది.

ఈ విధంగా ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో త‌మ‌న్నా వ‌ధువు అవతారంలో అందరిని చెడ‌గొడుతోంది. ఇందులో ఒక ఫోటోగ్రాఫ్ లో త‌మ‌న్నా మ‌త్స్య‌క‌న్య అవ‌తారంలోను క‌నిపించింది. ఈ లుక్ నిజంగా స్ట‌న్నింగ్. నేల‌మీదికి జాలువారుతూ పొడ‌వాటి డిజైన‌ర్ లెహంగాలో త‌మ‌న్నా విర‌హాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న మ‌రో ఫోటోగ్రాఫ్ కూడా వేడి పెంచుతోంది. వీటికి భిన్నంగా బుట్ట బొమ్మ అవతారంలో భారీత‌నం నిండిన డిజైన‌ర్ ఫ్లోర‌ల్ టాప్ లోను త‌మ‌న్నా ఎంతో అందంగా క‌నిపించింది. ఈ ఫోటోషూట్ లో త‌మ‌న్నా బెస్ట్ గెట‌ప్స్ యూత్ ని ఆక‌ర్షిస్తున్నాయి. మ‌రోవైపు త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా సెల‌క్టివ్ గా ముందుకు సాగుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే త‌మ‌న్నాఒక సినిమా ఓదెలా 2లో న‌టిస్తోంది. ఇటీవల మహా శివరాత్రి 2024 నాడు త‌మ‌న్నా న‌టిస్తున్న చిత్రం `ఓదెలా 2` ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌లైంది. హర్ హర్ మహాదేవ్ అంటూ మహా శివరాత్రి రోజు వచ్చిన పోస్ట‌ర్ కి క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది త‌మ‌న్నా. పోస్టర్‌లో త‌మ‌న్నా సాధువు అవ‌తారంలో క‌నిపించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక‌ చేతిలో పవిత్రమైన శంఖం మ‌రో చేతిలో డ్ర‌మ్‌ని ప‌ట్టుకుని వింత‌గా క‌నిపించింది. ఈ పోస్టర్ చూసి తమన్నా ఫ్యాన్స్ తనకు నిజంగా ఇంత భక్తి ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు .





Untitled Document
Advertisements