టాలీవుడ్ లో కిస్ సినిమాతో అడుగుపెట్టిన శ్రీలీల , తన అందం తో అభినయంతో అందరిని మెప్పించింది . తర్వాత చాల రోజులు సినిమాల జోలికి రాలేదు అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఈ అమ్మడి కాలం చెలిపోయిందా ? అందుకేనా కోలీవుడ్ వైపు చూస్తోంది? అంటే అవుననే తెలుస్తోంది. ఇండస్ట్రీకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన ఈ అమ్మడు నిన్న మొన్నటివరకూ అలాగే సినిమాలు చేసింది. `పెళ్లి సందడి` తర్వాత వరుస అవకాశాలు అటుపై స్టార్ హీరోలకు ప్రమోట్ అవ్వడం అంతా వేగంగా జరిగిపోయింది. ఆ తర్వాత రవితేజ , రామ్ , బాలయ్య , మహేష్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో తక్కువ సమయంలోనే అవకాశాలు అందుకుంది. దీంతో ఈ అమ్మడు నెంబర్ వన్ స్థానానికి అతి చేరువలోనే ఉందన్న టాక్ బలంగా వినిపించింది.
కానీ ప్రస్తుతం చేతిలో అవకాశాలే లేనట్లు కనిపిస్తుంది.ఈ అమ్మడు `గుంటూరు కారం` తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. కమిట్ అయిన `ఉస్తాద్ భగంగ్ సింగ్` షూటింగ్ మధ్యలో బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాతే ఆ సినిమా షూటింగ్ ప్రారంభయ్యేది. ఆ ఛాన్స్ తప్ప శ్రీలీల ఇంతవరకూ కొత్త సినిమాకి సంతకం చేసింది లేదు. ఇటీవలే తమిళనాడు లో కాలేజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ లో ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాలు చేయాలని ఉందన్న మనసు లో కోర్కెను బయట పెట్టింది.
దీంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో పరభాష వైపు చూస్తుంది? అన్న సందేహాలు మొదలయ్యాయి. తెలుగులో ఛాన్సులున్నా కూడా బిజీగా ఉన్నా కోలీవుడ్ వైపు ఇప్పట్లో చూసే అవకాశం ఉండేది కాదు. `పెళ్లి సందడి` తర్వాత `ధమాకా`లో ఛాన్స్ రావడానికి కొంత సమయం పట్టింది. ఈ గ్యాప్ లో ఖాళీ ఎందుకని రెండు కన్నడ సినిమాలు చేసింది. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో గ్యాప్ రావడంతో ఈసారి కోలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనాఈ అమ్మడు ఖాళీగా ఉండకుండా ఏదోఒక భాషలో అవకాశం కోసం ట్రై చేయడం గొప్ప విషయం. శ్రీలీల బ్యూటీకి అక్కడా ఇక్కడ ఎక్కడైనా అవకాశాలు రాకుండా ఉండవు. కాకపోతే ఈ అమ్మడు సోయగం ప్రేక్షకులను
మురిపిస్తూ తన అందం తో కుర్రాళ్ల గుండెలలో నిండి పోతుంది .