ఎర్రగా కనబడే మందారంతో ఎన్ని లాభాలో? తెలిస్తే వదిలిపెట్టరు

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 10:55 AM

ఎర్రగా కనబడే  మందారంతో ఎన్ని లాభాలో? తెలిస్తే వదిలిపెట్టరు

ప్రకృతిలో సహజ సిద్ధంగా మనకు అనేక రకాలైన పూలు మనకు దొరుకుతున్నాయి . అలా ప్రకృతి సిద్దంగా లభించే పూలలో మందారం ఒకటి. ఈ మందారం పూవ్వులను ఎక్కువగా అమ్మవారి పూజకే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మందారం పువ్వుల్లో ఉన్న ఔషద గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కేశ సంబంధమైన సమస్యల పరిష్కారానికి ఈ మందారం పూలే కాకుండా కూడా దివ్య ఔషదంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతారు.

ఇటీవల కాలంలో మహిళలలు తమ కేశాల సంరక్షణ,కోసం మందారం నుండే లభించే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకు ఇందులోని ఔషధ గుణాలు కేశాల దృడత్వానికి పనికి రావడంతోపాటు కేశ సంబంధ సమస్యలను కూడా పరిష్కరిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎర్రటి రంగులో ఉండే ఈ మందారం పువ్వులనే దేవీ పూజకు మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారు. లక్ష్మీదేవీ పూజలో తప్పక ఈ మందారం పువ్వులు ఉండాల్సిందే. అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న ఈ మందారం పుష్పాలు కొన్ని సీజన్లలో మాత్రమే పుష్కలంగా లభిస్తాయి. కొన్ని కాలాల్లో తక్కువ పూస్తాయి.


ఏ ఇంట్లో చూసినా ఏదో రకమైన మందారం చెట్టు కనిపించకమానదు. అటువంటి మందారం పూలలో ముద్ద మందారం అని, రెక్కల మందారం ఇంకా పలు రకాల మందారం పూలు లభిస్తాయి. ఈ పూల వలన వచ్చే నూనె జుట్టు కుదుళ్లు ధృడంగా ఉండటానికి, తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది . మందారంతో తయారు చేసిన తైలంతో వెంట్రుకలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ నూనే హేయిర్ టానిక్ లాగా పనిచేస్తుందని, ప్రస్తుతం మార్కెట్ లో మందారంతో తయారు చేసిన పలు రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి . అంతేకాకుండా ఈ మందారంతో టీ చేసుకొని తాగితే రోగ నిరోధక శక్తి పెరగడమేకాకుండా గుండెలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా బిపిని కూడా తగ్గిస్తుందని వివరించారు. ఎక్కడైనా సరే విరివిగా కనిపించే ఈ మందారం పువ్వు లను తెచ్చుకొని మనకు కావలసిన నూనెను తయారు చేసుకొని వాడుకోవచ్చును . వీటితో చేసిన ఆయిల్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది కానీ దానిలో కూడా ఎంతో కొంత ఫెర్టిలైజర్స్ కలుపుతారు కావున మనకు ఫ్రెష్ గా లభించే వీటినే ఉపయోగించుకొని చేసుకోవడం మేలు .






Untitled Document
Advertisements