వంకాయ వేపుడు, కూర మాత్రమే కాదు వెరైటీగా పకోడీ చేయండి అదిరిపోద్ది

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 02:17 PM

వంకాయ వేపుడు, కూర మాత్రమే కాదు వెరైటీగా పకోడీ చేయండి అదిరిపోద్ది

అందరికి పకోడీ , బజ్జి అంటే చాల ఇష్టం ఉంటుంది . కానీ ఎప్పుడు ఆనియన్ పకోడీ అంటే అందరికి బోర్ కొడుతుంది అందుకే డిఫరెంట్ గా ఉండే విధంగా వంకాయ పకోడీ ట్రై చేయండి ఇది అందరికి నచ్చుతుంది .వంకాయలు చాలా తక్కువ మందికి నచ్చుతాయి. నిజానికి వంకాయ వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా వంకాయ కూరను చూసి మూతి ముడుచుకునే వారు ఎంతోమంది. వంకాయ కూర నచనివారు ఓసారి వంకాయ పకోడీని తిని చూడండి. ఇలా వంకాయ పకోడీ చేసుకుంటే కొత్తగా ఉంటుంది. పైగా వంకాయని తిన్నట్టు ఉంటుంది.

వంకాయ పకోడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు - ఐదు

శెనగపిండి - రెండు కప్పులు

ధనియాల పొడి - అర స్పూను

కారం - అర స్పూను

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

వంటసోడా - చిటికెడు

వంకాయ పకోడి తయారీ విధానం :

1. వంకాయ పకోడీలను చేయాలంటే ముందుగా వంకాయలను నిలువుగా, సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు వాటిని నీటిలో ఉప్పు వేసి ఉంచాలి.

3. ఒక గిన్నెలో శెనగపిండిని వేసి అందులో పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

4. ఇప్పుడు వంకాయలను తీసి మిశ్రమంలో వేయాలి.

5. సరిపడా నీటిని వేసి దీన్ని పకోడీ పిండిలా కలుపుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

7. నూనె బాగా వేడి అయ్యాక వంకాయలు కలిపిన శెనగపిండిని పకోడీల్లా నూనెలో వేసుకోవాలి.

8. పకోడీలు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు కచ్చితంగా తింటారు.

వంకాయ తినడం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు వంకాయలు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే కొన్ని రకాల వ్యాధులనుండి రక్షణ కల్పిస్తుంది. వంకాయలో పైల్స్, హేమ రాయిడ్స్ తగ్గించే లక్షణం ఉంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంకాయను తరచూ తినాలి. శరీరం నుంచి దుర్వాసన వస్తున్న వారు కూడా వంకాయతో చేసిన ఆహారాలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వంకాయలను అధికంగా తినడం వల్ల పెద్ద పేగులో విషాలు, రసాయనాలు పేరుకుపోకుండా ఇది నివారిస్తుంది. అలాగే పెద్ద పేగును క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.ఈ విధంగా వంకాయ తో పకోడీ చేసుకోవడం వలన వంకాయ తినని వారు కూడా తింటారు . అంతేకాకుండా పిల్లలు కూడా ఎప్పుడు ఒక్కటే అనకుండా ఉంటారు . ఇది ఒకసారి టేస్ట్ చుసిన తర్వాత మళ్ళి మళ్ళీ కావాలి అంటారు .





Untitled Document
Advertisements