గీత గోవిందం' త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 02:31 PM

గీత గోవిందం' త‌ర్వాత  విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు తీసిన విజయదేవరకొండ . కానీ అన్ని సినిమాల కన్న అర్జున్ రెడ్డి సినిమాతో తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు. 2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ప‌ర‌శురాం ఫ్యామిలీ స్టార్ తో చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. ఆ క‌ల‌యిక‌తోనే 'గీత గోవిందం' కి సీక్వెల్ చేస్తున్నారా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. అందుకు త‌గ్గ‌ట్టు 'ఫ్యామిలీస్టార్' అనే టైటిల్ ప్ర‌క‌టించ‌డంతో కంటెంట్ అలాగే ఉండ‌ బోతుంద‌ని దాదాపు ఓ అంచానికి వ‌చ్చేసారంతా. అటుపై రిలీజ్ అయిన టీజ‌ర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ తో మ‌రింత ఆధారం దొరికింది. విజ‌య్ లుంగీ లుక్..వంట గ‌దిలో వ్య‌వ‌హారాలు ఆయన చేసే పిసినారి త‌నం 'గీత‌గోవిందం' లో పాత్ర‌ల్ని రివ‌ర్స్ చేసినా ఇలా కొన్ని హింట్లు ప‌ర్పెక్ట్ ఫ్యామిలీ స్టార్ లానే అనిపించాయి. తాజాగా వచ్చిన ఈ ట్రైల‌ర్ తో ఇది ప‌క్కా ఫ్యామిలీ మూవీ అని తేలిపోయింది. 'గీత‌గోవిందం' కి సీక్వెల్ లా అనిపిస్తుంది. మ‌రోసారి విజ‌య్ ఇమేజ్ లేడీ ఫాలోయింగ్ ని దృష్టి లో పెట్టుకుని రాసుకున్న క‌థ‌లా తెలుస్తుంది. హీరోయిన్ హీరో వెంట ప‌డ‌టం అటుపై హీరో కాద‌న‌డం త‌ప్పు తెలుసుకున్న హీరో విదేశాలు వెళ్లి ఒప్పించ‌డాన్ని ప‌ర‌శురాం త‌న‌దైన శైలిలో కామెడీ ట‌చ‌ప్ తో ఆవిష్క‌రించాడు.

అలాగే విజ‌య్ లో యాక్ష‌న్ స్టార్ ని హైలైట్ చేసాడు. నేనైతే మీకు ఫుల్లుగా ప‌డిపోయా అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పిన రొమాంటిక్ డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. బుర్ర బ‌ద్ద‌లైపోతుద్ది కొడ‌కా భ‌య‌ప‌డాలిరా ఇంకోసారి ఎవ‌రైనా చుల‌క‌న‌గా మాట్లాడాలంటే అంటూ విజ‌య్ విల‌న్స్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. హీరో లో మెంట‌ల్ లెవ‌ల్ ని ట‌చ్ చేసిన‌ట్లు క‌నిస్తుంది. కోపం ఎగిరి పోతుందంటే న‌న్ను కొట్ట‌వే బాబు! అంటూ ట్రైల‌ర్ చివ‌ర్లో విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌గానే మృణాల్ అత‌డి చెంప‌పై లాగి పెట్టి కొట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది.
మిడిల్ క్లాస్ కుర్రాడిలో స్టైలిష్ గా క‌నిపిస్తూనే కామెడీతోనే న‌వ్వించాడు. హీరో-హీరోయిన్ల ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తుంది . ప్ర‌స్తుతం ట్రైల‌ర్ ట్రెండింగ్ లో ఉంది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్నిఉగాది సందర్భంగా ఏప్రిల్ లో తెలుగు ,త‌మిళ‌ ,హిందీ , ఈ మూడు భాష‌ల ల్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్ వస్తుంది . దీని బట్టి విజయ్ ఖాతాలో మరో హిట్ మూవీ పడేటట్లు తెలుస్తుంది .





Untitled Document
Advertisements