భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు తగ్గాలంటే ఇంట్లో మొక్క పెంచుకోండి

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 03:54 PM

భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు తగ్గాలంటే ఇంట్లో  మొక్క పెంచుకోండి

సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏది అయినా మంచి పని చేయాలి అన్న, ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వస్తువులు పెట్టుకునే వరకూ ప్రతి విషయంలో వాస్తు నియమాలు పాటిస్తారు. అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు చేస్తుంది.

అదృష్టం, సంపద పెరగాలని కోరుకుంటూ కొంతమంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మార్చే మొక్కలు అనగానే మనీ ప్లాంట్, క్రాసుల, లక్కీ వెదురు ఎక్కువగా పెంచుకుంటారు. ఇవే మాత్రమే కాదు నెమలి మొక్క కూడా మీ ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్న తొలగించడంలో ప్రభావంతంగా పనిచేస్తోంది. మీ ఇంట్లో ఈ నెమలి మొక్కని నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెమలి మొక్క ప్రాచుర్యం పొందింది. ఎక్కడ చూసినా ఇవి గుబురుగా కనిపిస్తూ అందంగా, ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అటువంటి ఈ నెమలి మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. కుటుంబంలోని సమస్యలు తొలగిపోయి సామరస్య వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.ఈ నెమలి మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంటికి సంపదలు తీసుకొస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఈ మొక్క మీ ఇంట్లో ఉత్తర దిశలో ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. అటువంటి ఇంట్లో వాస్తు ప్రకారం నెమలి మొక్క నాటడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. దీంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఉంటుందని విశ్వసిస్తారు. వీటిని ఇంట్లో జంటగా నాటడం వల్ల కుటుంబ సభ్యులు తెలివితేటలు పెరుగుతాయి. ఈ మొక్క మీ పని మీద దృష్టి పెట్టేందుకు, పిల్లలు చదువులో రాణించేందుకు, ఏకాగ్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.
నెమలి మొక్కలు పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నగా గుబురుగా పెరిగే ఈ మొక్కలు పెంచుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిన్న కొమ్మలతో మందపాటి ఆకులతో ఉంటుంది. దీన్ని మీ ఏంటి ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోయేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. అయితే ఈ మొక్క ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎండిపోతే ఇబ్బందులు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి అనర్ధాలు జరగవు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు నెమలి మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిది. రోగాల పాలన పడకుండా కాపాడేందుకు ఇది దోహదపడుతుంది. దక్షిణ దిశలో పొరపాటున కూడా ఈ మొక్క పెట్టకూడదు. ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడూ జంటగా ఉన్న మొక్కలు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే డబ్బుకు కొరత ఉండదు. ఈ విధంగా ఇంట్లో ఈ నెమలి మొక్కను పెంచుకోవడం వలన చాల లాభాలు ఉన్నాయి . కావున అందరూ కూడా వీటిని పెంచుకొని ఆర్థిక ఇబ్బందులనుండి ఉపశమనము పొందవచ్చును .





Untitled Document
Advertisements