ఇంట్లోనే చాలా సులువుగా కుల్ఫీ తయారీ

     Written by : smtv Desk | Thu, Mar 28, 2024, 04:05 PM

ఇంట్లోనే చాలా సులువుగా కుల్ఫీ తయారీ

వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీమ్ల కావాలి అని మారం చేస్తూ ఉంటారు . ప్రతిసారి బయట కొనే ఐస్ క్రీములు కన్నా ఇంట్లోనే మీరు కుల్ఫీలను తయారు చేసి పెడితే ఎంతో మంచిది. సాదరణ ఐస్ క్రీమ్తో పోలిస్తే కుల్ఫీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . మనకు డబ్బు కూడా ఆదా అవుతుంది . కుల్ఫీలు ఇంట్లోనే చాలా సులువుగా చేయొచ్చు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి


బ్రెడ్‌తో చేసే కుల్ఫీ రెసిపీకి కావలసిన పదార్థాలు:

మిల్క్ బ్రెడ్ ముక్కలు - రెండు

కండెన్స్ డ్ మిల్క్ - ఒక కప్పు

ఫ్రెష్ క్రీము - ఒక కప్పు

గోరువెచ్చని పాలు - ఒక కప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

కుంకుమపువ్వు - రెండు రేకులు

బాదం, పిస్తా తరుగు - గుప్పెడు

బ్రెడ్‌తో చేసే కుల్ఫీ రెసిపీ:

ముందుగా బ్రెడ్ అంచులను కట్ చేసి ఒక గిన్నెలో వేయండి. గోరువెచ్చని పాలను ఆ బ్రెడ్ పై పోయండి. అవి మెత్తగా నానిపోతాయి.
ఆ తర్వాత యాలకుల పొడిని కలపండి. కండెన్స్‌డ్ మిల్క్ కూడా వేసి బాగా కలపండి. ఫ్రెష్ క్రీము, యాలకుల పొడి, తరిగిన బాదం పిస్తాలు వేసి బాగా కలపాలి.

కుంకుమ పూల రేకలను రెండు స్పూన్ల పాలల్లో నానబెట్టాలి. ఆ పాలను కూడా మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో ఫ్రిజ్లో 12 గంటల పాటు ఉంచండి.

తర్వాత మౌల్డ్స్ కాసేపు నీళ్లలో పెట్టి తీస్తే కుల్ఫీ బయటికి సులువుగా వచ్చేస్తుంది. ఈ కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

ఈ కుల్ఫీలో మనం ఉపయోగించినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. పాలు, బాదం, పిస్తా, కండెన్స్‌డ్ మిల్క్, ఫ్రెష్ క్రీము, యాలకుల పొడి, కుంకుమపువ్వు. ఇవన్నీ కూడా మనకు ఏదో రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తారు. మిల్క్ బ్రెడ్ లో కూడా పాలే ఉంటాయి. కాబట్టి రుచిగా ఉంటాయి. ఇందులో మనం పంచదారను కలపలేదు. పంచదార కలిపితే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ మిల్క్ బ్రెడ్‌లో ఉన్న తీయదనమే ఈ కుల్ఫీకి సరిపోతుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఈ సమ్మర్ లో చేసి పెట్టండి. ఇంకా పిల్లలు పెద్దలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు.అంతేకాకుండా మీ పిల్లల బర్త్ డే స్ కి ఆలా చేయండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా ఇష్టపడతారు .





Untitled Document
Advertisements