అంజీర్ పండ్లు ఏ కాలంలో తినడం ఆరోగ్యనికి మంచిదంటే..

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 02:26 PM

అంజీర్ పండ్లు ఏ కాలంలో తినడం ఆరోగ్యనికి మంచిదంటే..

మన నిత్య జీవితంలో ఎన్నో రకాలైన పండ్లను తింటూ ఉంటాము . కానీ కొన్ని పండ్లు కొన్ని సీజన్ లో మాత్రమే దొరుకుతాయి. కొన్ని అన్ని సీజన్ లో దొరుకుతాయి . అన్ని పండ్లను అన్ని సీజన్ లో తినలేము . అలాంటి కోవకు చెందిన వాటిలో అంజీర్ ఒక డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే వేసవికాలంలో మాత్రం అంజీర్ పండ్లు తినే విషయంలో పెద్ద సందిగ్ధం నెలకొంది. దీనికి కారణం అంజీర్ పండ్లు వేడి స్వభావం కలిగి ఉంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవి కాలంలో ఈ పండ్లను తినడం వలన కొన్ని రకాలైన నష్టాలు ఉన్నాయి . అయితే వీటిని కొందరు మాత్రమే తినాలి .

ఆస్తమా రోగులు:

అత్తిపండ్లు లేదా అంజీర్ పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల కండ్ల కలక, రినిటిస్, అనాఫిలాక్టిక్ షాక్ లు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆస్తమాతో బాధపడేవారు అంజీర్ పండ్లు తినకూడదు.దీని వలన వారి యొక్క ఆస్తమా పెరుగుతుంది .

కాలేయం:

అత్తిపండ్లలో ఉండే గింజలు కాలేయం మీద చెడు ప్రభావం చూపిస్తాయి. ఇవి కాలేయానికి హాని కలిగిస్తాయి. అత్తి పండ్లలో ఉండే విత్తనాల ప్రభావం వెంటనే కనిపించకపోయినా కొన్ని గంటల తరువాత వాటి ప్రభావం ఉంటుంది.కావున కాలేయ సమస్యతో బాధ పడే వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి .

కడుపు సమస్యలు:

అత్తి పండ్లను ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో చికాకు, వాపు వంటి సమస్యలు రావచ్చు.ఆహారంలో అత్తిపండ్లను చేర్చుకునేటప్పుడు వాటి బెనిఫిట్స్ ఏ కాదు వాటి దుష్ప్రభావాలు కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఉష్ట్రోగ్రత 40డిగ్రీలు దాటినప్పుడు వీటిని తినకూడదు. చలికాలంలో అత్తిపండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా నియంత్రిస్తుంది. అయితే బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి.అంజీర్ పండ్లను పాలలో వేసి మరిగించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యం మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది.ఏవి అయినా అతిగా తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి . కావున అది దృష్టిలో పెట్టుకొని తినాలి .






Untitled Document
Advertisements