చేతి నిండా చిత్రాలతో మాస్ కా దాస్

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 03:22 PM

 చేతి నిండా చిత్రాలతో మాస్ కా దాస్

మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. చాల తక్కువ సినిమాలు నటించిన కూడా మోస్ట్ పాపులర్ హీరో అయ్యాడు. తనదైన యాక్టింగ్ తో రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటున్నారు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో.ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస మూవీస్ లో నటిస్తూ తెలుగు సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరిస్తున్నారు.అంతేకాకుండా నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు
ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విశ్వక్ సేన్ మంచి హిట్ అందుకున్నారు ఎవరూ సాహసించని అఘోర పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా పొందారు. ఈ మూవీకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు కూడా తిరిగిచ్చేశారు. మరికొద్ది రోజుల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మే17వ తేదీన ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
అయితే విశ్వక్ సేన్ నేడు తన బర్త్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా VS10 మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మెకానిక్ రాకీ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ ఇదేనని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవర్ ఫుల్ కమ్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు విశ్వక్ సేన్. సిగరెట్ తాగుతూ రెంచ్ పట్టుకుని యమా స్టైలిష్ గా ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో మెకానిక్ షెడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విశ్వక్ ఫస్ట్ లుక్ ఫుల్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సరసన తెలుగమ్మాయి మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్, వైవా హర్ష, హర్ష వర్ధన్, రోడీస్ రఘరామ్ నటిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. ఎస్‌ ఆర్‌ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వీరితోపాటు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇప్పటికె గామి సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించిన మాస్ కా దాస్ మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ సాదిస్తాడో చూడాలి మరి .





Untitled Document
Advertisements