పిండికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

     Written by : smtv Desk | Fri, Mar 29, 2024, 04:02 PM

 పిండికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

చాల మంది నెలకు సరిపడే సరుకులు ఒకే సారి తెచ్చి పెట్టుకుంటారు . అందులో చాల రకాలైన వస్తువులు ఉంటాయి . అందులో
గోధుమపిండి, శనగ పిండి, జొన్న పిండి ఇలా చాలా పిండి పదార్థాలను కూడా తెచ్చుకుంటారు . ఇలా పిండి తీసుకొచ్చినప్పుడు కొన్ని రోజులకి అందులో పురుగులు పడుతుంటాయి. వాటిని అలానే వాడలేం.అప్పుడు వాటిని క్లీన్ చేసుకొని వాడాలి అంటే పెద్ద సమస్యగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.

మనం వాడే పిండిని ఎంత కావాలో తీసుకుని మిగతా పిండిని గాలి చొరబడని బ్యాగ్స్, డబ్బాల్లో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టండి. దీని వల్ల అందులోకి పురుగు పట్టకుండా ఉంటాయి. అందులో పురుగులు ఉన్నా చనిపోతాయి. దీనిని జల్లెడ పడితే ఆ పురుగులు బయటికొచ్చేస్తాయి.

ముందుగా పిండిని వాడేటప్పుడు కచ్చితంగా జల్లెడ పట్టాలి. చిన్న సైజ్ ఉన్న జల్లెడతో జల్లించాలి. అప్పుడే అందులో ఉన్న కీటకాలు అన్ని పోతాయి. కాబట్టి, కచ్చితంగా జల్లెడ పెట్టాలి.మీరు ఈ పిండి పదార్థాలను ఎండలో పెట్టాలి. అప్పుడే అందులోనే చాలా పురుగులు బయటికొచ్చేస్తాయి. అయితే, వీటిని బయట పెట్టినప్పుడు ఎలాంటి క్రిములు రాకుండా చూసుకోవాలి.అంతేకాకుండా పిండిని ఎప్పుడు గాలి చొరబడని డబ్బాలో పెట్టి స్టోర్ చేయాలి . అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు పెట్టి స్టోర్ పెట్టొచ్చు.ఎలా చేయడం వలన పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి .అదే విధంగా, ఎప్పటికప్పుడు అందులో వంట గదిలోని షెల్ఫ్‌లను క్లీన్ చేయండి. అంతేకాకుండా ఆఫర్‌లో వస్తుంది కదా అని ఎక్కువగా కొనకుండా తక్కువగా కొని వాడండి.ఏది అయినా ఎక్కువ రోజులు వాడకపోతే ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి.ఇలా చిన్న చిన్న టిప్స్ వినియోగించుకొని పిండికి పురుగులు పట్టకుండా చేసుకోవచ్చు .





Untitled Document
Advertisements