కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా.. కాంగ్రెస్

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 03:39 PM

కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా.. కాంగ్రెస్

తెలుగు రాష్టాలు రెండు కలిసున్న సమయంలో ఎమ్మెల్యే , మినిస్టర్ , సీఎంగా భాద్యతలను నిర్వర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రీస్ జాతీయ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఆయనకు రాజకీయంగా ఎలాంటి వెలుగు లేకున్నా మూడేళ్ళ పాటు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇపుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. పైగా కాంగ్రెస్ మంచి పదవితో గౌరవిస్తే వచ్చిన అవకాశాన్నిఅందిపుచ్చుకుని మరోసారి రాజకీయంగా ఎదగడానికి కిరణ్ కూడా బాటలు వేసుకోవచ్చు.. ఈ ఆకస్మిక పిలుపుకు కారణం ఏంటి అని ఆరా తీస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అతి పెద్ద పదవి ఇచ్చి దక్షిణ భారత దేశంలోని పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి నామమాత్రపు పదవి కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే పదవిని ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ దాదాపుగా ఓటమిపాలవుతున్న విషయం తెలిసిందే. అయితే రాబోయే ఎన్నికలలోనైన తనదైన మార్కును చూపించి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. కావున పార్టీలోని సీనియర్లు అందరితో సమావేశాలు జరుపుతూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది. అయితే ఏపీ తెలంగాణాతో పాటు కర్నాటకలో కూడా కిరణ్ తిరిగేందుకు అవకాశం ఉంది. ఇక తమిళనాడు బోర్డర్ లో కూడా పెద్ద ఎత్తున రెడ్డి సామాజికవర్గం ఉన్నారు. వారిని కూడా ఆకట్టుకోవచ్చు. ఇలా కిరణ్ కి పదవి ఇవ్వడం వలన కాంగ్రెస్ కి కలిసివచ్చే అవకాశాలే మెండు అని రాజకీయ నిపుణులు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించి సౌత్ ఇండియా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ గేర్ మార్చవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





Untitled Document
Advertisements