మరోసారి ముంబైలో విజయ్ వర్మతో కనిపించిన మిల్కీ బ్యూటీ

     Written by : smtv Desk | Tue, Jan 17, 2023, 11:57 AM

మరోసారి ముంబైలో విజయ్ వర్మతో కనిపించిన మిల్కీ బ్యూటీ

ప్రేక్షకులు మిల్కీ బ్యుటి అని ముద్దుగా పిలుచుకునే తమన్నా ఈ మధ్య ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తూ అందరిని షాక్ కు గురిచేస్తుంది. అసలే ఈ మధ్య ఈ అమ్మడి పెళ్లి విషయంలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్ల పై తమన్నా కూడా ఘాటుగానే స్పందించింది.అయితే, తాజాగా విజయ్ వర్మ, తమన్నా భాటియా మరోసారి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కెమెరా కంట్లో పడ్డారు. గోవాలో జరిగిన నూతన సంవత్సరం వేడుకల పార్టీలో వీరు తళుక్కుమనడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో, వీరిద్దరు సహజీవనంలో ఉన్నారనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ కలసి కనిపించడం అనుమానాలను బలపరిచేలా ఉంది. తమన్నా మోకాలి పైకి ధరించిన సింగిల్ స్కర్ట్ తో కనిపించింది. విజయ్ బ్లూరంగు హుడీలో కనిపించాడు. దీనికి ఒక రోజు ముందు అవార్డుల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. గోవాలో జరిగిన న్యూఇయర్ పార్టీలో తమన్నా, విజయ్ ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలింతలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అనంతరం గోవా నుంచి ముంబైకి కలిసే తిరిగొచ్చారు. వీరి బంధం వివాహ బంధంగా మారుతుందా? అన్నది చూడాల్సిందే. మరి ఇప్పుడు మిల్కీ బ్యూటీ రియాక్షన్ ఏంటో చూడాలి ఇక.





Untitled Document
Advertisements