కీర్తి సురేష్ ఓ వ్యాపారవేతతో రిలేషన్ షిప్ లో ఉందట.. నాలుగేళ్ల తరువాత వీళ్ళ పెళ్ళేనట!

     Written by : smtv Desk | Wed, Jan 25, 2023, 12:26 PM

కీర్తి సురేష్ ఓ వ్యాపారవేతతో రిలేషన్ షిప్ లో ఉందట.. నాలుగేళ్ల తరువాత వీళ్ళ పెళ్ళేనట!

మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్ పెళ్లి గురించిన వార్తలు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. పియిఎల్;లి కావాల్సిన హీరోయిన్స్ లిస్ట్ లో ఈ అమ్మది పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. తరుచుగా ఈ అమ్మడి పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. కీర్తి తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్లో ఉందని, నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజాగా ప్రచారమవుతున్న సమాచారం. కీర్తి సురేష్ స్నేహితుడికి కేరళలో వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ తో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. అనంతరం వ్యాపారవేత్తతో ఆమె వివాహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఆమె పెళ్లికి సంబంధించి కల్పిత కథనాలు, ఊహాగానాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. దీనిపై కీర్తి సురేష్ ఇంత వరకు స్పందించలేదు. ఈ ప్రచారంలో నిజం పాళ్లు ఎంతన్నది ఆమె స్వయంగా చెబితేనే తెలుస్తుంది. మరి ఈ విషయం పై కీర్తి నోరు విప్పుతుందా? లేదా అనేది వేచి చూడాలి.





Untitled Document
Advertisements