మాంసాహారాలు త్వరగా ఉడకాలి అంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2024, 01:42 PM

మాంసాహారాలు త్వరగా ఉడకాలి అంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

మాంసాహార ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. అయితే రోజు నాన్వెజ్ వండుకు తినాలి అంత టైమ్ ఉండదు. అలాగే నాన్వెజ్ ఉడికేందుకు గ్యాస్ మరియు సమయం రెండు వరుడా అవుతాయి. అయితే నాన్వెజ్ వండుకునే సమయంలో ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీ గ్యాస్, టైమ్ సేవ్ అవడంతో పాటు మీకు శ్రమ కూడా తగ్గుతుంది.
నాన్‌వెజ్ వండేటప్పుడు ముందుగా పీసులను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీని వల్ల త్వరగా ఉడుకుతుంది. కూర కూడా బావుంటుంది.ఇది కూరలకే కాక బిర్యానీ చేసేటప్పుడు కూడా చిన్నగా కట్ చేస్తే రుచిగా కూడా ఉంటుంది.

* ముఖ్యంగా నాన్‌వెజ్ వండినప్పుడు మ్యారినేట్ చేస్తే కూర త్వరగా ఉడకుతుంది. దీనికోసం నిమ్మరసం, మసాలాలు కలిపి ముక్కలకి పట్టించి అలానే కాసేపు వదిలేయండి. దీని వల్ల నాన్‌వెజ్ చక్కగా నానడమే కాకుండా మసాలా అంతా ముక్కలకి పట్టి టేస్టీగా కూడా ఉంటుంది.

* ప్రెజర్ కుక్కర్‌లో వండితే త్వరగా వంట అవుతుంది. అందుకే, చాలా మంది ఈ కుక్కర్స్‌ని వాడుతున్నారు. ముఖ్యంగా నాన్‌వెజ్ త్వరగా ఉడికిపోతుంది.

* నాన్వెజ్ వంటలు ఎంతసేపటికి ఉడకకుండా విసిగిస్తున్నట్టుగా అనిపిస్తే కూరలో మామిడి ఆకు లేదా బిర్యాని ఆకు వేస్తె త్వరగా ఉడికిపోతాయి. ఆకు వేయడం ఇష్టం లేదు అనుకుందే పోకని పగలగొట్టు కాస్త ముక్కని కూరలో వేసినా ఉడికిపోతుంది.

* మీరు ఆల్కహాల్ తీసుకునే వారు అయితే గనుక ఒక మూత బ్రాందీ కూరలో వేస్తె కూర త్వరగా ఉడికిపోతుంది.

తెలుసుకున్నారు కదా నాన్వెజ్ త్వరగా ఉడికించేందుకు కావాల్సిన టిప్స్ ఈసారి మీరు నాన్వెజ్ వండుకునేటప్పుడు ఈ టిప్స్ వాడుకోండి.





Untitled Document
Advertisements