నిమ్మ, యాపిల్ రెండిట్లో ఏది బెస్ట్ ?

     Written by : smtv Desk | Sat, Feb 10, 2024, 10:16 AM

నిమ్మ, యాపిల్ రెండిట్లో ఏది బెస్ట్ ?

మన ఆరోగ్యానికి మంచి చేసేవి అనగానే మనకు మొదట గుర్తొచ్చేవి నిమ్మకాయ, యాపిల్ రెండు. రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనే కలుపుకుని తాగితే మంచిది అనే మాట దాదాపు అందరి నోట్లో నుండి వినబడుతుంది. అలాగే రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అని కూడా అనడం మనం తరుచుగా వింటూనే ఉంటాము. అయితే నిమ్మ, యాపిల్ రెండిట్లో ఏది మంచిది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి రెండిటి ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం..

లెమన్ జ్యూస్ మాత్రం శరీరంలో చేరిన వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని కాస్త తేనె లేదా ఉప్పు ను వేసుకుని గంట వ్యవధిలో లీటరు నుండి రెండు లీటర్ల వరకు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

ఈమద్య కాలంలో చాలా మంది తిండి సమయానికి తినక పోవడం వల్ల గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. గ్యాస్ సమస్యలు కాస్త ఎక్కువ అయితే తీవ్రమైన సమస్యలుగా మారే అవకాశం ఉంది.అందుకే ముందుగానే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా సాధ్యం అయినంత వరకు ప్రతి రోజు ఒక్కసారి అయినా నిమ్మ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం మరియు అజీర్తి వంటి సమస్యలు ఎదురయినప్పుడు లెమన్ జ్యూస్ బాగా పని చేస్తుంది.

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ జ్యూస్ ను తాగడం వల్ల పళ్లలో ఉండే క్రిములు తొలగి పోవడం తో పాటు నోటి యొక్క చెడు వాసన కూడా పోతుంది. నిమ్మకాయ అంటే వెంటనే ప్రతి ఒక్కరు కూడా లెమన్ జ్యూస్ గుర్తుకు వస్తుంది. కొందరు దీనిని షర్బత్ అని కూడా అంటారు. వేడి చేసినప్పుడు చేసుకునే షర్బత్ లో చక్కర మరియు ఉప్పు కలిపి తాగాలి. అందుకే యాపిల్ కు ఏమాత్రం తగ్గకుండా నిమ్మకాయలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటూ నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements