చిరాయువు ఎవరు?

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 12:01 PM

చిరాయువు ఎవరు?

చిరాయు అనే ఇతడు ఒక ప్రాచీన దేశపు రాజు. నాగార్జునుడు ఇతని మంత్రి. నాగర్జునుడికి రసాయన సిద్ది తయారుచేసే రహస్యం తెలుసు. అలాచేసి రాజు,తను దాన్ని స్వీకరించారు. దానివల్ల ఎన్నాళ్ళైనా వారు యువకులుగానే వుంటారు. కొంతకాలానికి చిరాయువు తన కుమారుడైన జీవహరుడిని యువ రాజును చేయగా అతడా విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆమె దానివల్ల నీవేప్పటికి రాజువు కాలేవని ఇప్పటికే రాజు 800 సంవత్సరాలు బ్రతికాడని ఇలా యువరాజులైన వారు రాజులు కాకుండానే మరణించారని దానికి కారణం నాగార్జునుడేనని తనని వధించమని చెప్తుంది. ఈ సలహా నచ్చి ఒక మధ్యాహ్న సమయమున నాగార్జునుడి ఇంటికి వెళ్ళగా అతని కోరిక తెలుసుకొని తలను నరకమంటాడు. జీవహరుడు తన ఖడ్గంతో నాగార్జునుడి మెడను ఎన్నిసార్లు నరికినా కనీసం గాటు కూడా పడటం లేదు. అంతలో రాజు వచ్చి దీన్నీ హర్షించకపోగా ఇంతకుముందు పూర్వజన్మలో తన తల ఇలానే నరకబడిందని చెప్పి తన దేహం నుండి చరణం తీసి ఆ ఖడ్గానికి పూయగా వెంటనే నాగార్జునుడి తల తెగిపోయింది. చిరాయువు కుమారుడు జీవహరుడు రాజయ్యాడు. కాని నాగార్జునుని కొడుకులు ఇతన్ని వధించగా దుఃఖంలో అతని తల్లి మరణించింది.





Untitled Document
Advertisements