పరీక్షిత్తు మహారాజును శపించింది ఎవరు?

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 01:01 PM

పరీక్షిత్తు మహారాజును శపించింది ఎవరు?

గవిజాతుడు ఇతడు ఒక ముని కుమారుడు . గొప్ప దేవి భక్తుడు. ఇతని తండ్రి తన ఆశ్రమంలో తపమాచరించుచుండగాపరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్లి దాహార్తియై ఇతని ఆశ్రమమునకు వచ్చి మంచి నీరు కోరగా తపస్సులో ఉన్న ముని వినిపించుకోలేదు. అప్పుడు పరీక్షిత్తు కోపంతో ఓ చనిపోయిన పామును కర్రతో అతని పైకి విసిరి తన రాజ ప్రాసాదమునకు పోతాడు. మునికుమారుడైన గవిజాతుడు ఈ పని చేసింది ఎవరు అనేది తెలుసుకోకుండా తన తండ్రిని అవమానించిన వాడు ఏడూ రోజులలో తక్షకునిచే చంపబడతారు అని శపిస్తాడు. తర్వాత అది చేసింది పరీక్షిత్తు మహారాజు అని గ్రహించి తన శాపమును గూర్చి పరీక్షిత్తుకు తెలియజేయగా విధి బలీయమని పరీక్షిత్తు అతనికి బదులిచ్చెను.





Untitled Document
Advertisements