గర్గుడు ఎవరు?

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 01:31 PM

గర్గుడు ఎవరు?

గర్గుడు విష్ణు అంశతో జన్మించినవాడు. బృహస్పతి గర్భిణి అయిన తన సోదరుని భార్య మమతతో సంగమించగా అప్పటికే గర్భిణి అయిన ఆమె ఇద్దరికి జన్మనిచ్చి పిల్లల్ని వదలి వెళ్ళిపోగా మరుత్తులు వీరిని పెంచుతారు. భరతునికి జన్మించిన పిల్లలు అవినీతిపరులు అగుట వలన వారిని వారి తల్లులే చంపగా దేవతలు ప్రసాదించిన వీరిని తన వారసులుగా పెంచుకుంటాడు. వారే భరద్వాజుడు, దీర్ఘతముడు, భరద్వాజుని వంశంలో జన్మించినవాడే గర్గుడు. గర్గుని కుమారుడే శని (శనేశ్వరుడు కాదు). కొంతకాలానికి గర్గుడు యాదవులకు గురువుగా పరిణమిస్తాడు. శ్రీరాముడు వనవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు అతణ్ణి దర్శించిన వారిలో గర్గుడు కూడా ఉన్నాడు. ఇతడు ముఖ్య ఖగోళ శాస్త్రవేత్త. సరస్వతీ నదీ తీరంలో గర్గశ్రోత అనే స్థలం వుంది. గ్రహాల కదలిక నక్షత్రాల గమనం గురించి ఇతడు విపులీకరించాడు.





Untitled Document
Advertisements