ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలి

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 03:09 PM

 ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు మ‌రో మూడు రోజుల స‌మయం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో నటీనటులకు నిర్మాతల మండలి ఓ విజ్ఞప్తి చేసింది. 'మా' ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఈ నెల 10వ‌ తేదీన ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో అందులో పాల్గొన‌కుండా సినీన‌టులు షూటింగుల‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌డంతో ఎన్నికల అధికారి నిర్మాత‌ల మండ‌లికి అభ్యర్థన చేయ‌డంతో ఆ మండ‌లి ఈ ప్ర‌కట‌న చేసింది.

ఆదివారం ఉదయం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నిక‌లకు స‌మయం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డం కాక రేపుతోన్న విష‌యం తెలిసిందే. మొద‌ట ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షులుగా ఐదుగురు పోటీ చేయాల‌ని భావించారు. చివ‌ర‌కు ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మాత్ర‌మే ఆ ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు.





Untitled Document
Advertisements