ఒక సినిమాకు రెండు ట్రైలర్లు...కారణం చెప్పిన RX 100 డైరెక్టర్

     Written by : smtv Desk | Wed, Oct 13, 2021, 06:15 PM

ఒక సినిమాకు రెండు ట్రైలర్లు...కారణం చెప్పిన RX 100 డైరెక్టర్

మామూలుగా సినిమా విడుదలకు ముందు ఉండే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ముందు మ్యూజిక్ ప్రమోషన్స్ ఆ తరువాత టీజర్లు, ట్రైలర్ అంటూ రచ్చ చేస్తారు. అయితే ఒక్క ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేస్తుంటారు. కానీ అజయ్ భూపతి మాత్రం అందరికీ భిన్నంగా రెండు ట్రైలర్లను వదులుతాడు. ఆర్ ఎక్స్ 100 సినిమా సమయంలోనూ అలానే చేశాడట. తాజాగా మహా సముద్రం విషయంలోనూ అలాంటి పనే చేశాడు. తాజాగా మహా సముద్రం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇందులో అజయ్ భూపతి తన సినిమా గురించి మాట్లాడాడు. ఈ రెండేళ్ల ప్రయాణం గురించి ఎమోషనల్ అయ్యాడు. చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు మహా సముద్రం రేపు (అక్టోబర్ 14) విడుదల కాబోతోందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రెండు ట్రైలర్లను విడుదల చేయడంపై క్లారిటీ ఇచ్చాడు. మొదటి ట్రైలర్ విడుదలైన తరువాత.. ట్రెండ్ సెట్టింగ్ ట్రైలర్ వదిలావ్ అని అందరూ ప్రశంసించారట. అందరూ అద్భుతంగా ఉందని అంటే.. దీనికి మించిన ట్రైలర్ వదులుతాను అని చెప్పాడట. అయితే అందరూ వద్దని అలా చేయకని సలహా ఇచ్చారట. ఆ ట్రైలర్ అద్భుతంగా ఉంది. రెండోది వస్తే అంతకంటే గొప్పగా ఉండాలి. అది చాలా కష్టమవుతుందని వద్దన్నారట. కానీ సినిమా మీద నమ్మకంతో రెండో ట్రైలర్ కట్ చేసిన తరువాత నిర్మాతకు పంపాడట. నిర్మాతకు కూడా నచ్చడంతో వెంటనే రెండో ట్రైలర్‌ను వదిలినట్టు చెప్పుకొచ్చాడు.






Untitled Document
Advertisements