ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లోకి ఓదేలు దంపతులు

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 10:28 AM

ప్రియాంక  సమక్షంలో కాంగ్రెస్ లోకి ఓదేలు దంపతులు

తెలంగాణాలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి . అధికార తెరాసకు వ్యతిరేఖంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. దీనిలో భాగంగానే పార్టీ ఫిరాయింపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలోని మరియు ఇటు ప్రతిపక్ష పార్టీల్లోని పలువురు అసంతృప్త నేతలంతా పార్టీ వీడే పనిలో పనిలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి . రేవంత్ రెడ్డి టిపిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ వర్గాల్లో చాలా వరకు ఉత్తేజం కనిపిస్తుంది . అయితే అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పెద్ద చేపకే గాలం వేసి అధికార తెరాసాకు షాక్ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తెరాసకు కీలక నేత అయితే ఈయనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కోవడం కూడా జరిగిపోయింది . నిన్న సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, ప్రియాంకా ‌గాంధీతో సమావేశమయ్యి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం వారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వయంగా వారి మెడలో కండువాలు కప్పుతూ పార్టీలోకి వారిని ఆహ్వానించారు. దీంతో.. సుదీర్ఘకాలంగా టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధం తెగినట్లైంది. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ కి కీలక నేతగా బాద్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం వెలువడుతుంది. తెలంగాణా రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ పార్టీకి భారీ తగిలిందనె చెప్పవచ్చు . రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వచ్చే అవకాశం ఉన్నందునా అన్ని పార్టీలు నేతలను తమ పార్టీలోకి ఫిరాయించుకునే పనిలో ఉన్నాయి. ఏది ఏమైనా తెలంగాణాలో మరో కొత్త రాజకీయ శకం మొదలవుతుందనేది రాజకీయ నిపుణుల వాదన.





Untitled Document
Advertisements