తారక రామారావు శతజయంతి ఈ సందర్భంగా ఓ లేఖను విడుదల చేసిన బాలకృష్ణ

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 12:20 PM

తారక రామారావు శతజయంతి ఈ సందర్భంగా ఓ  లేఖను విడుదల చేసిన బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నట సామ్రాట్ నందమూరి తారకరామారావు గారి జయంతి వేడుకల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖలో తెలుగు జాతి వైభవాన్ని తెలుగు భాష గొప్పతనం నలుమూలల విశ్వమంతటా నలుమూలలా వ్యాపింపజేసిన తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోని నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల గురించి పేర్కొన్నారు . అయితే ఈ వేడుకలను మే 28 న నందమూరి బాలకృష్ణ ప్రారంభించనుండగా వచ్చే ఏడాది తారక రామారావు గారి జన్మదినం వరకు కొనసాగనున్నాయి. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత అని పేర్కొనడం జరిగింది. తదనంతరం తెనాలి లో జరగబోయే శతాబ్ది వేడుకలను బాలకృష్ణ ప్రారంభించనున్నారు. 365 రోజులు... వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు... ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొంటానని తెలుగు జాతికి తెలియజేస్తున్నాను అని బాలకృష్ణ ఉత్తరంలో పేర్కొన్నారు. అయితే ఈసారి నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా ఈ విధంగా నందమూరి కుటుంబం ఉత్సవాలను జరపనున్నారు.





Untitled Document
Advertisements