తెలంగాణలో టెట్ పరీక్ష వాయిదా పడనుందా..

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 02:35 PM

తెలంగాణలో టెట్ పరీక్ష వాయిదా పడనుందా..

తెలంగాణలో చాలా రోజుల తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్ ) నోటిఫికేషన్ విడుదల అయింది. అది ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయి జూన్ 12వ తారీకు ఎగ్జామ్ ఉండనుంది అయితే ఈ పరీక్ష షెడ్యుల్ వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ 12 వ తారీఖున అర్ఆర్బీ రైల్వే డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎగ్జామ్ ఉండడం వలన రెండు పరీక్షలకుఅప్లై చేసిన అభ్యర్థులకు రెండు పరీక్షలు ఒకేసారి రావడం వీలుకాదు కావున దీనిని వివరిస్తూ ఓ వ్యక్తి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ట్వీట్ చేశారు. అయితే ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ .. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి .. ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించండి అన్నట్లుగా ట్వీట్ చేశారు. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరికొన్ని రోజుల్లో కి వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఒకే రోజు రెండు పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మాత్రం ఏదో ఒక దానిని వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.





Untitled Document
Advertisements