యూనివర్సిటీల అంశాలపై కెసిఆర్ పై షర్మిల ఫైర్

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 04:26 PM

యూనివర్సిటీల అంశాలపై కెసిఆర్ పై షర్మిల ఫైర్

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై యూనివర్సిటీల అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని యూనివర్సిటీలలో అధ్యాపకుల నియామకాలు చేపట్టడం లేదని షర్మిల మండిపడ్డారు అంతేకాక యూనివర్సిటీ విద్యార్థులు తెరాస నాయకులను యూనివర్సిటీలలో కి రానీయడం లేదని వారిపై కక్ష కట్టి యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా భ్రష్టు పట్టించాలని ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. అంతేకాక యూనివర్సిటీలలో కొత్తగా వచ్చిన కోర్సుల ప్రవేశ పెట్టకుండా పాత కోర్సులను కూడా ఎత్తివేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది అని ఇకనైనా అలాంటి నిర్ణయాలు మానుకోవాలని హితవు పలికారు. యూనివర్సిటీలోని విద్యార్థులు చదువుకున్న వారు కావడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అనే నెపంతో నే ప్రభుత్వ తీరు ఇలా ఉందని పేర్కొన్నారు. యూనివర్సిటీలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వరకు తాము పోరాడుతామనీ.. 25 వారాల నుండి తాము ఈ సమస్య పై పోరాటం చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.





Untitled Document
Advertisements