లైంగిక వేధిస్తున్నాదంటు కోడలి పిర్యాదు.. బలవన్మరణానికి పాల్పడిన మాజీ మంత్రి

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 03:04 PM

 లైంగిక వేధిస్తున్నాదంటు కోడలి పిర్యాదు.. బలవన్మరణానికి పాల్పడిన మాజీ మంత్రి

ప్రస్తుత రోజుల్లో ఏది నిజం ఏది అబద్దం అని తెచుకోవడం కష్టతరంగా మారిపోయింది. కారణం కొంతమంది తమ సొంతవారిపైనే వావి వారసులు మరించి లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే సమాజంలో అలాంటి నీచపు పనులకు పాల్పడుతూ వ్యక్తులు ఉండడంతో కొంతమంది వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకొని అనవసరమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏ తప్పుచేయకున్నా నీచమైనా ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడంతో పరువుకు ప్రాణం ఇచ్చే వారు అన్యాయంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్ లో ఎదురైంది. అసలు నిజంగా ఇలా జరిగిందా లేదా అనే వివరాలు తెలియరాలేదు కానీ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి మాత్రం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ తాగునీటి ట్యాంకు పైకి ఎక్కిన ఆయన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు విడిచారు. రాజేంద్ర బహుగుణ 2004లో ఎన్డీ తివారీ సర్కారులో మంత్రిగా వ్యవహరించారు. కాగా, మూడ్రోజుల కిందట రాజేంద్ర బహుగుణపై ఆయన కోడలు తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెపై బహుగుణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బహుగుణ కోడలు భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. బహుగుణ నివాసంలోనే మరో ఫ్లోర్ లో ఆమె తన కుమార్తెతో ఉంటున్నారు. అయితే, తనపై కోడలు తీవ్ర ఆరోపణలు చేయడం, మనవరాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బయట ప్రచారం జరగడంతో మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
ఎమర్జెన్సీ నెంబరు 112కి కాల్ చేసిన అనంతరం, హల్ద్వానీలోని భగత్ సింగ్ కాలనీలో ఓ వాటర్ ట్యాంకు ఎక్కారు. కిందికి దిగి రావాలని పోలీసులు నచ్చచెప్పినా, ఆయన హఠాత్తుగా దేశవాళీ తుపాకీ తీసి తనను తాను కాల్చుకున్నారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements