ఫోన్‌ రిపేర్‌ అయినపుడు వ్యక్తిగత డేటా లీక్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారా.. ఇక మీద ఆ బాధ ఉండదు..

     Written by : smtv Desk | Tue, Aug 02, 2022, 02:01 PM

ఫోన్‌ రిపేర్‌ అయినపుడు వ్యక్తిగత డేటా లీక్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారా.. ఇక మీద ఆ బాధ ఉండదు..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన మొబైల్ ఫోన్‌ లకు కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటా ఎవరూ దొంగలించకుండా ఉంచేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఫోన్‌ను ఏదైనా రిపేర్‌కు ఇచ్చిన సందర్భాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో వినియోగదారుల వ్యక్తిగత డేటా ఏదో ఓ రూపంలో బయటకు వస్తుంది. ఫోన్ రిపేర్‌ అయిన సందర్భాల్లో బాగు చేయడానికి షాప్‌లో ఇస్తాం. అలా ఇచ్చినపుడు మన వ్యక్తిగత డేటా అందులోనే ఉంటుంది. దానిలోని మన డేటా ఎక్కడ లీక్ అవుతుందోనని ఆందోళన చెందుతాం. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా శాంసంగ్‌ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు 'రిపేర్ మోడ్' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌ను ఈ ఫీచర్‌తో విడుదల చేయాలని యోచిస్తోంది.
రిపేర్ మోడ్ ఫీచర్‌ యాక్టివేట్ చేయడం :
* మొబైల్ సెట్టింగులలో "బ్యాటరీ అండ్‌ డివైస్‌ కేర్‌" ఆఫ్షన్‌కి వెళ్లి రిపేర్‌ మోడ్‌ని ఆన్‌ చేయాలి. * తర్వాత, ఫొటోలు, సందేశాలు, ఖాతాలు మొదలైన వాటితో సహా డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. * డిఫాల్ట్ యాప్‌లు మాత్రమే యాక్సెస్ చేయబడతాయి.
రిపేర్ మోడ్ ఫీచర్‌ డీయాక్టివేట్ చేయడం :
* వినియోగదారులు ఫొన్‌ను రీబూట్ చేసి వేలిముద్ర లేదా లాక్‌ ఆన్‌ చేయడం ద్వారా రీపేర్‌ మోడ్‌ డీయాక్టివేట్‌ చేయవచ్చు.
శామ్‌సంగ్ రిపేర్ మోడ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్‌లకు అప్‌డేట్ ద్వారా వస్తుంది. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లకు రానుంది.

Untitled Document
Advertisements