అప్పట్లో చంద్రుడిపై నడక.. నాసా విడుదల చేసిన తాజా వీడియో.

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 05:04 PM

అప్పట్లో చంద్రుడిపై నడక.. నాసా విడుదల చేసిన తాజా వీడియో.

అంతరిక్షం అనంతమైన త్రిపరిమాణాత్మక ప్రదేశము. భూవాతావరణ కక్ష్యకు అవతల ఉన్న, హద్దులు లేని అనంతమైన భాగాన్ని అంతరిక్షం (స్పేస్) అంటారు. ఫలానా చోట భూవాతావరణం అంతమై, అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం. అంతరిక్షం దగ్గరవుతున్నకొద్దీ, వాతావరణం కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. మానవాళి చరిత్రలో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటి చందమామపై మనిషి అడుగు పెట్టడం. దశాబ్దాల క్రితమే అమెరికా తన అపోలో అంతరిక్ష యాత్రలతో చంద్రుడిపైకి మనుషులను పంపగలిగింది. అపోలో 11 వ్యోమనౌక ద్వారా ఆస్ట్రోనాట్లు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ తొలుత అక్కడ అడుగు పెట్టారు. అయితే చందమామపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. వాతావరణం అత్యంత పలుచగా ఉంటుంది. మన శరీరాలు భూమి గురుత్వాకర్షణకు, ఇక్కడి వాతావరణ పీడనానికి తగినట్టుగా ఉంటాయి. దీనితో చందమామపై దిగిన ఆస్ట్రోనాట్లు నడవడానికి చాలా ఇబ్బందిపడ్డారు.
గురుత్వాకర్షణ ఇబ్బందితో : సాధారణంగా ఇక్కడ మనం అడుగు వేసి, తీయడానికి కొంత బలం ప్రయోగిస్తాం. అది భూమి గురుత్వాకర్షణ (గ్రావిటీ)కు అనుగుణంగా ఉంటుంది. కానీ చంద్రుడిపై గురుత్వాకర్షణ తక్కువ కాబట్టి మనం అదే బలంతో కాలు వేస్తే.. రబ్బర్ బంతిలా తిరిగి వెనక్కి ఎగురుతుంది.
దీనితో అక్కడికి వెళ్లిన ఆస్ట్రోనాట్లు నడవడానికి ప్రయత్నిస్తూ.. కింద పడిపోయిన దృశ్యాలు నాసా వీడియోలో ఉన్నాయి. ఆస్ట్రోనాట్లు అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని.. కాసేపటికి మెల్లగా ఎగిరి దూకుతూ ముందుకు కదిలారు. ఈ వీడియోలను స్లో మోషన్ లో విడుదల చేశారు. అందులో ఆస్ట్రోనాట్లు పడ్డ ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాసా విడుదల చేసిన ఫుటేజీని మొదట యూనివర్సల్ క్యూరియాసిటీ ఖాతాలో, తర్వాత సాహిల్ బ్లూమ్ పేరిట ఉన్న ఖాతాలో పోస్ట్ చేశారు. https://twitter.com/SahilBloom/status/1567578180680032257ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1567578180680032257%7Ctwgr%5E8493db3bede35fe5aacbd5bf157f81b3839293d8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-754118%2Fhow-hardships-the-astronauts-faced-to-walk-on-the-moon-here-is-the-video-released-by-nasa

Untitled Document
Advertisements