తెలంగాణ డిజిపిని పాదయాత్రకు అనుమతి కోరుతున్న కాంగ్రెస్ నేతలు

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:33 AM

తెలంగాణ డిజిపిని పాదయాత్రకు అనుమతి కోరుతున్న కాంగ్రెస్ నేతలు

తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు కలిశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు వీహెచ్, చిన్నారెడ్డి డిజిపిని కలిసిన వారిలో ఉన్నారు. అయితే ఏఐసిసి నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు అనుమతిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా రాహుల్ పాదయాత్ర తెలంగాణలో అక్టోబర్ 24వ తేదీ నుండి కొనసాగనుంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో తన పాదయాత్రను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి ఫైనల్ రూట్ మ్యాప్ ను టీ.కాంగ్రెస్ నేతలు సిద్ధం చేశారు.గతంలో అనుకున్నట్టుగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర 13 రోజుల పాటు సాగనుంది. రాహుల్ గాంధీ తెలంగాణలో మొత్తం 359 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 13 రోజులపాటు రోజు వారీగా రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనే నియోజకవర్గాల జాబితాను కూడా టీపిపిసి సిద్ధం చేసింది. కాగా రాహుల్ గాంధీ పాదయాత్ర ముందుగా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం కృష్ణ గ్రామం వద్ద ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements