ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. సీజీఎచ్చ్ఎస్ బిల్లు పేమెంట్స్‌పై కేంద్రం క్లారిటీ

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 01:36 PM

ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. సీజీఎచ్చ్ఎస్ బిల్లు పేమెంట్స్‌పై కేంద్రం క్లారిటీ

సీజీఎచ్చ్ఎస్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం . అల్లోపతిక్, ఆయుర్వేదం, యోగ, యునాని, సిద్ధ మరియు హోమియోపతి ఔషధాల కింద వెల్‌నెస్ సెంటర్లు పాలిక్లినిక్‌ల ద్వారా వైద్య సదుపాయాలు అందించబడతాయి. అయితే సెంట్రల్‌ గవర్నమెంట్ హెల్త్‌ స్కీమ్ కింద చికిత్స అందించే ఆసుపత్రులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. వార్డుల కేటాయింపు నుంచి మందుల సూచన, చికిత్స విధానాల వరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీజీఎచ్చ్ఎస్ కింద ఎంపికైన ఆసుపత్రులు ఒకే ట్రీట్‌మెంట్‌ పీరియడ్‌కి రెండు వేర్వేరు బిల్లులను సిద్ధం చేయలేవు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022 నవంబర్ 10న విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండం‌లో పేర్కొంది. ఎం ఓ ఎచ్చ్ ఎఫ్ డబ్ల్యూ తాజా ఆర్డర్ ప్రకారం.. ఎంపికైన ఆసుపత్రులు సీజీఎచ్చ్ఎస్/డిపార్ట్‌మెంట్ నుంచి పేమెంట్‌ క్లెయిమ్ చేయడానికి ఒక బిల్లు, లబ్ధిదారుడు చెల్లించాల్సిన మొత్తానికి మరో బిల్లు ఇవ్వలేవని తెలిపింది. కావున ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్డర్స్‌లో పేర్కొన్న నిబంధనలు, షరతుల ప్రకారం తప్పు చేసిన ఆసుపత్రిపై తగిన తగిన చర్యలు ఉంటాయని, సీజీఎచ్చ్ఎస్ ప్యానెల్ నుంచి తొలగిస్తామని పేర్కొంది. సీజీఎచ్చ్ఎస్ కింద సెలక్టెడ్‌ ఆసుపత్రులలో వార్డుల కేటాయింపు సంబంధిత ఏడో వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతన స్థాయి ప్రకారం జరుగుతుంది. ఆసుపత్రులు లబ్ధిదారుని లేదా వారి అటెండెంట్‌ని విడివిడిగా మందులు, ఉపకరణాలను బయటి నుంచి కొనుగోలు చేయమని అడగకూడదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2013లో స్పష్టం చేసింది. సీజీఎచ్చ్ఎస్ నిర్ణయించిన ప్యాకేజీ రేటులో చికిత్సను అందిస్తామని తెలిపింది.
కాని మందులకు సంబంధించి సెలక్టెడ్‌ ఆసుపత్రుల నిపుణులు జారీ చేసే ప్రిస్క్రిప్షన్‌లలో తప్పనిసరిగా సాధారణ పేరు రాయాలి. ఆసుపత్రుల నిపుణులు ఎక్కువ ధర లేదా పోషక పదార్థాల విభాగంలోకి వచ్చే వస్తువులను సూచించకూడదు. యాంటీబయాటిక్ పాలసీ (ఆసుపత్రి) తప్పనిసరిగా అనుసరించాలి. యాంటీ ఫంగల్ ఏజెంట్స్ సహా హై ఎండ్ యాంటీబయాటిక్స్ న్యాయబద్ధమైన ఉపయోగం కోసం జాగ్రత్త తీసుకోవాలి. వీటికోసం ఏర్పాటైన కమిటీ సిఫార్సుల మేరకు ఉపయోగించాలి. IV అల్బుమిన్ ఉపయోగం కోసం సూచించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. తిరిగి ఉపయోగించలేని వస్తువులను పరిమితుల్లో సూచించాలి. రోగి చెప్పిన సమస్యలు, వారికి అందించిన చికిత్స వివరాలను తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాలి. తరచూ అవసరమయ్యే ఇన్వెస్టిగేషన్లు తప్పనిసరిగా చికిత్సకు జోడించాలి, చికిత్సకు అనుగుణంగా ఉండాలి. ఎస్టాబ్లిష్డ్‌ చికిత్స విధానం ఉపయోగించాలి. కొత్త మందు లేదా విధానం వినియోగిస్తే అందులోని ప్రయోజనాలను రోగికి ప్రత్యేకంగా సూచించాలి. కాగా సీజీఎచ్చ్ఎస్ కార్డ్ కాపీ, నాన్-ఎమర్జెన్సీలు / లబ్ధిదారులలో 75 సంవత్సరాల వయస్సు వరకు పర్మిషన్‌ లెటర్‌ కాపీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, డిశ్చార్జి కాపీ, చెల్లుబాటు అయ్యే ఎన్ఏబీఎచ్చ్/ఎన్ఏబీఎల్ సర్టిఫికేట్ కాపీ అవసరం. పేమెంట్‌ కోసం హాస్పిటల్ బిల్లు, వైద్యులు సంతకం చేసిన రోజువారీ మెడికల్‌ నోట్స్‌ స్పష్టమైన కాపీ, కాలక్రమానుసారం ప్రోగ్రెస్ చార్ట్, విచారణ కాపీలు, ఇంప్లాంట్‌కి సంబంధించిన ఇన్‌వాయిస్, ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్ ఆర్డర్ ప్రకారం అందజేయాల్సి ఉంటుంది. సీజీఎచ్చ్ఎస్ పేర్కొన్న అంశాలను అందుకున్న క్రెడిట్ బిల్లులను పరిశీలిస్తుంది. కొన్ని వస్తువులను అనవసరంగా ఉపయోగించినట్లు తెలిస్తే, బిల్లుల నుంచి తీసివేస్తుంది.





Untitled Document
Advertisements