మత మార్పిడికి అభ్యంతరం చెప్పిందని భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్త

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 03:38 PM

మత మార్పిడికి అభ్యంతరం చెప్పిందని భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్త

ప్రస్తుత కాలంలో బలవంతపు మత మార్పిడులు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసిన ఇవే కేసులు, గొడవలు. ఈ నేపధ్యంలో తాజాగా ఒ సంఘటన వెలుగులోకి వచ్చింది. మత మార్పిడికి అభ్యంతరం చెప్పడంతో భర్త తనను తరచూ కొట్టి హింసించాడని, సిగరెట్ పీకలతో కాల్చి, బలవంతంగా మాంసం తినేలా చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. భర్త చాంద్ మహ్మద్ హిందువునని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని సదరు మహిళ ఆరోపించింది. పెళ్లి సమయంలో తన పేరును సాని మౌర్య అని చెప్పాడని వెల్లడించింది. వివాహం తర్వాత లక్నో నగరంలో అద్దెకు ఉంటున్నామని, కొన్నాళ్లుగా భర్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ఇస్లాం మతాన్ని స్వీకరించాలని బలవతం చేశాడని చెప్పింది.
తాను మతం మారనని చెప్పడంతో శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడని, సిగరెట్ పీకలతో కాల్చివేసి, వేడి నూనె పోశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని, బంధువులతో తనపై అత్యాచారం చేయిస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఇంటి నుంచి పారిపోయి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ భర్త తమ గదిలోకి లాక్కెళ్లి కొట్టేవాడని బాధితురాలు ఆరోపించింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా చాంద్ మహ్మద్ తనను కొట్టడంతో గర్భస్రావం జరిగిందని ఆమె పేర్కొంది. వన్–స్టాప్ సెంటర్ ద్వారా రక్షణ పొందిన సదరు మహిళ తన భర్తపై పోలీసుకు ఫిర్యాదు చేయనుంది.





Untitled Document
Advertisements