మేఘాలు ఏర్పడడానికి కారణం ఉష్ణోగ్రతల ప్రభావమేనా?

     Written by : smtv Desk | Fri, Jan 20, 2023, 01:05 PM

మేఘాలు ఏర్పడడానికి కారణం ఉష్ణోగ్రతల ప్రభావమేనా?

ఆకాశంలో మనకు కనిపించేది ఏంటి? అంటే ఎవరైనా ముందుగా చెప్పేది మేఘాలు అని.. ఎందుకంటే మేఘాలు ఎప్పటికి అలానే ఉంటాయి. కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొంత సమయం మాత్రమే కనిపిస్తాయి.. అలాగే కొన్ని మేఘాలు ఎప్పటికి అలానే ఉంటాయి. కాకపోతే అవి స్థిరంగా ఉండకుండా ఆకాశంలో అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తాయి. కానీ, వర్షం కురుసే సమయానికి ముందు కొన్ని నల్లటి మేఘాలు కనిపిస్తాయి. ఎలాంటి మేఘాలు కనిపించినప్పుడు మబ్బు పట్టేసింది. వర్షం పడేలా ఉంది అంటూ మన ఇళ్ళలో పెద్దవాళ్ళు అనడం మనం తరుచుగా వింటూనే ఉంటాము. అయితే ఈ అసలు ఎలా ఏర్పడతాయి.. అనే సందేహం వస్తుంది..
మేఘాలు ఏర్పడటానికి గాలిలో ఉండే అసంఖ్యాక నీటి బిందువులు ఐస్ క్రిస్టల్స్ కలసి ఏర్పడినవే మేఘాలు. సూక్ష్మ బిందువుల రూపంలో గాలిలో చేరిన నీరు మనకు మేఘాల రూపంలో కనబడుతుంది. చల్లగాలి కంటే వేడిగాలిలోనే తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతా ప్రభావం వలన ఈ మేఘాలలోకి కొత్తగా నీటి బిందువులు వచ్చి చేరుతూనే ఉంటాయి. మేఘాలలో అర్ర్ధతా శాతం సంతృప్తికర స్థాయికి చేరగానే అవి వర్షిస్తాయి. అంటే భూమ్యాకర్షణ శక్తి వలన అవి భూమి మీద వర్ష రూపంలో కురుస్తాయి.





Untitled Document
Advertisements